తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించింది. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 39 గెలుచుకుంది. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానం గెలుచుకున్నాయి.
ముందుగా అందరూ ఊహించిన విధంగా డిసెంబరు 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ మాత్రమే రావడంతో అభ్యర్థులను కాపాడుకోవడం కష్టంగా మారింది. ఇవాళ రాత్రి సీఎల్పీ సమావేశం జరగనుందని తెలుస్తోంది. అందులో కాబోయే సీఎం ఎవరో తేలిపోనుంది. రేపు కొత్త సీఎం ప్రమాణం చేసేందుకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.