తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్కు
అవకాశం లభించిందన్నారు. కాంగ్రెస్
విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు
గ్యారెంటీలతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
చేపట్టిన భారత్ జోడో యాత్ర తమలో స్ఫూర్తి నింపిందన్నారు. తెలంగాణలో రాహుల్
పాదయాత్ర 21 రోజులపాటు సాగిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ
కుటుంబసభ్యులకు తెలంగాణతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. తమ విజయం పై కేటీఆర్
స్పందనను స్వాగతిస్తున్నామన్న రేవంత్, కొత్త ప్రభుత్వానికి విపక్షాలు
సహకరించాలన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలను
ఆహ్వానిస్తామన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ సూచనలు, సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు.
ప్రగతి భవన్, ఇక నుంచి ప్రజా భవన్ గా మారుతుందని రేవంత్ తెలిపారు.
తనను భారీ మెజారిటీతో గెలిపించిన కొడంగల్
ఓటర్లకు కూడా రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశానికి కొడంగల్ ను ఓ మోడల్ గా
నిలబెడతానని ట్వీట్ చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతీ
కార్యకర్తను కాపాడుకుంటామన్నారు.