తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన
కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తమకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్,
నేడు విడుదలైన ఫలితాల గురించి తాము బాధపడటం లేదని, కానీ ఆశించిన ఫలితాలు
రాకపోవడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. ఓటమి నుంచి తిరిగి పాఠాలు నేర్చుకుని మళ్లీ బలపడతామని ఆశాభావం వ్యక్తం
చేశారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందని ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు విజయం
సాధించారు. గజ్వేలు నుంచి కేసీఆర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్, సిద్దిపేట నుంచి
హారీశ్ జయకేతనం ఎగురవేశారు. అయితే ఐదుగురు మంత్రులు పరాజయం చెందారు. పువ్వాడ అజయ్
కుమార్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబల్లి దయాకరరావు
ఓడారు. గజ్వేలుతో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ అక్కడ ఓడారు. కామారెడ్డిలో
బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్
లోచేరిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఈ సారి ఓడారు.