టీపీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘన విజయం (telangana election results) సాధించారు. సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థిపై 32800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ విజయం సాధించారు. కోటమిరెడ్డి వెంకటరెడ్డి సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థిపై 50 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్లో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ జీవితం మొదలెట్టిన తరవాత ఇది మొదటి ఓటమి కావడం గమనార్హం. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో విజయభావుటా ఎగురవేశారు. సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచారు.కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలవగా, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం అతి తక్కువ మెజారిటీతో బయటపడుతున్నారు.
మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ 71, బీఆర్ఎస్ 34 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు పూర్తిగా వెల్లడికావడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశముంది.