తెలంగాణలో
కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 67 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో
ఉన్నారు. బీఆర్ఎస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ
ఓటింగ్ శాతం మెరుగుపడింది. బీఆర్ఎస్ 37 చోట్ల, బీజేపీ 10 చోట్ల ముందంజలో ఉంది.
ఎంఐఎం నాలుగు చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడ్లో ఉండటంతో
ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
అశ్వారావుపేట
అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆదినారాయణ విజయం సాధించారు. కాంగ్రెస్ ఈ
ఫలితంతో రాష్ట్రంలో బోణీకొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పై 28,358 ఓట్ల తో ఆదినారాయణ
నెగ్గారు.
ఇల్లందు
నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. హస్తం గుర్తు పై పోటీ చేసిన కోరం
కనకయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై 38
వేలు పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు.
రామగుండంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖరారు
అయింది. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి
చందర్ పై విజయం సాధించారు. చార్మినర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్
అలీ నెగ్గారు. బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ విజయం సాధించారు.