వాయు కాలుష్యం పెరిగిపోవడంతో భూతాపం ప్రమాదకరస్థాయికి చేరుకుంటోందని పర్యావరణవేత్తలు (amercia environment) ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మించడం ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అంతే కాదు ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను 2035 నాటికి మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూసివేసి బొగ్గు వినియోగం సున్నాకు తీసుకురానున్నట్లు అమెరికా ప్రకటించింది. 2035 నాటికి బొగ్గు వినియోగం సున్నాకు తీసుకువస్తామని అమెరికా గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
బొగ్గు, చమురు, గ్యాస్ ఇంధనాల నుంచి వెలువడే మిథేన్ ఉద్గారాలను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతికత వినియోగించాలని పరిశ్రమలను బైడెన్ ఆదేశించారు.
వాయు కాలుష్యం తగ్గించేందుకు అమెరికా తాజా నిబంధనలు విడుదల చేసింది.