ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీ సాయిబాబా
సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి
కానుకలు కరిగించి పతకాలు, నాణేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సుమారు
450 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండిని భక్తులు కానుకలుగా రూపంలో సాయినాథుడికి
సమర్పించారు. భారీగా నిల్వ ఉన్న ఈ కానుకలను కరిగించి 5,10 గ్రాముల నాణేలు, పతకాలను
తయారు చేసుకోవాలని ప్రభుత్వం అనుమతి కోరినట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
వెల్లడించింది.