కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లీడ్ లో ఉండగా గజ్వేలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప
ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ముందుంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే
సరికి కేటీఆర్ 2,621 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేటీఆర్ కు 10, 199 ఓట్లు లభించాయి.
రెండో స్థానంలో కేకే మహేందర్ రెడ్డి ఉండగా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ మూడో
స్థానానికి పరిమితమయ్యారు.
కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో
ఉన్న ధర్మపురి అరవింద్, స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. రెండో రౌండ్
ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 120 ఓట్లు తక్కువ సాధించారు. బీఆర్ఎస్
అభ్యర్థి సంజయ్ కుమార్ కు 7,374 ఓట్లు రాగా, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ధర్మపురి
అరవింద్ కు 6,168 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ మూడో స్థానంలో ఉన్నారు.
బీజేపీ ముఖ్యనేత బండి సంజయ్ కూడా వెనుకబడి
ఉన్నారు. కరీంనగర్ స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి
బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 2,232 ఓట్ల లీడ్ లో ఉన్నారు. సిద్ధి పేటలో హరీశ్
రావు హవా కొనసాగుతుండగా, ఖమ్మం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ రెండో స్థానంలో ఉన్నారు.
గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ వెనుకబడి ఉండగా, మహేశ్వరంలో బీఆర్ఎస్
అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వెనకబడిలో ఉన్నారు.తెలంగాణలో మొత్తం 119
స్థానాలకు గానూ ఇప్పటికే 62 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు
60 సీట్లు అవసరం.