కాల్పుల విరమణ సంధి ముగియడంతో హమాస్ ఉగ్రవాదులను (israel hamas war) ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. కాల్పుల గడువు శుక్రవారం ముగిసిపోవడంతో ఖతార్‌లోని తమ మధ్యవర్తులను ఇజ్రాయెల్ వెనక్కు పిలిపించుకుంది. కాల్పుల విరమణ సంధిలో మెుస్సాద్ అధికారులు కీలకపాత్ర పోషించారు. కాల్పుల విరమణ గడువు ముగియగానే హమాస్ ఉగ్రవాదులు రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు.
తాజా పరిస్థితులను అంచనా వేసిన ఇజ్రాయెల్ తమ దౌత్యాధికారులు ఖతర్‌లో ఉండటం క్షేమం కాదని భావించింది. దీంతో వెంటనే వారు ఇజ్రాయెల్ వచ్చేయాలని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజుల్లో గాజాపై ఇజ్రాయెల్ మరిన్ని వైమానిక దాడులు చేసే అవకాశముందని తెలుస్తోంది.