Cyclone michaung:
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న
తీవ్ర వాయుగుండం ఈ ఉదయం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి మించౌంగ్ అనే పేరును
మయన్మార్ సూచించింది.
తుపాను
వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 5న, నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని
భారత వాతావరణ సంస్థ(IMD) వెల్లడించింది.
తుఫాను ప్రభావంతో
నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
తెలిపింది. దక్షిణ కోస్తాలో డిసెంబర్ 6 నుంచి విస్తారంగా వానలు కురుస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు
వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుపాను
ప్రభావిత ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు
తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుకు
కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని, విద్యుత్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే
పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
తుపాను ప్రభావంతో రేణిగుంట విమానాశ్రయంలో పలు
విమానసర్వీసులు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా బయలు దేరనున్నాయి. దక్షిణ మధ్య
రైల్వే కూడా పలు రైళ్ళను రద్దు చేసింది. తొలి జాబితాలో 142 రైళ్ళు, రెండో జాబితాలో
మరో పదింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.