తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకు
విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదరర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా ఉన్నాయి. అంచనాలకు మించి కాంగ్రెస్
అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
కామారెడ్డిలో వెనకబడిన బీఆర్ఎస్
అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో మాత్రం లీడింగ్‌లో ఉన్నారు.
కామారెడ్డి జిల్లా
బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం
శ్రీహరి, జుక్కల్‌లో
షిండే, శేరిలింగంపల్లిలో
గాంధీ ముందంజలో ఉన్నారు. మిగిలిన చోట్ల
మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్
పార్టీలో 50 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 34 చోట్లు ముందంజలో
ఉంది. బీజేపీ 8 స్థానాల్లో ఇతరులు 2
స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.
మునుగోడులో
రెండో రౌండ్ ముగిసే సరికి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి
కూనంనేని ఆధిక్యంలో ఉన్నారు.
దేవరకద్రలోనూ కాంగ్రెస్
అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, బెల్లంపల్లిలో
కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్‌లో
పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో
జీవన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో
తొలి రౌండ్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2,380 ఓట్లతో ఆధిక్యంలో
కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు ముందంజలో ఉన్నారు.
సిద్ధిపేటలో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు ముందంజలో
ఉండగా, సికింద్రాబద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని
శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
దేవరకొండ, మానకొండూరులో కాంగ్రెస్ దూసుకుపోతుంది.
కామారెడ్డి, కొడంగల్ లో రెండు చోట్ల
రేవంత్ రెడ్డి లీడ్ లో ఉండగా, బీజేపీ చీప్ బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి
కంటే వెనుకబడి ఉన్నారు.
ఈటల రాజేందర్ రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉండగా, మేడ్చల్
లో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇల్లందు,
నారాయణఖేడ్, అచ్చంపేటలో కాంగ్రెస్ కు మొదటి రౌండ్ లో అధిక ఓట్లు వచ్చాయి.