బడిలో, తరగతి గదుల్లో హిజాబ్ (bihar hijab issue) వద్దన్నందుకు బిహార్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బెదిరింపులు వచ్చాయి. బిహార్‌లోని శేఖ్‌పురా డీఈవో ఓంప్రకాశ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శేఖ్‌పురా జిల్లా చారువా ప్రాధమిక పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని డీఈవో స్పష్టం చేశారు.
గత నెల 29న కొందరు విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించి ఆందోళనకు దిగినట్లు డీఈవో ఓం ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు. తమ ఆచారాలను అడ్డుకుంటే పాఠశాలను నడపనీయమని వారు బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించారు. నివేదిక అందాక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. తరగతి గదుల్లో హజాబ్ అనుమతించమని డీఈవో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టాన్ని ఆశ్రయిస్తామన్నారు.