All-party meet on Winter Session : పార్లమెంటు శీతాకాల
సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 21 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
వీటిలో రెండు ద్రవ్య బిల్లులు
కూడా ఉన్నాయి.
హోంమంత్రిత్వ శాఖ నుంచి మూడు బిల్లులు, అలాగే సెంట్రల్ వర్సిటీ
కి
సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి చర్చిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల
శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
అఖిలపక్ష
సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ బిల్లులు జాబితా గురించి వివరించారు.
కేంద్రమంత్రి
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ
సమావేశంలో 23 పార్టీలకు చెందిన 30 మంది సభ్యులు పాల్గొన్నారు. సభ నిర్వహణకు
సంబంధించి పలువురు సభ్యులు, సూచనలు అందజేశారని చెప్పారు.
భారతీయ
న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధారాలు బిల్లులను కేంద్ర
హోంశాఖ ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతుందన్నారు.
డిసెంబరు
4 నుంచి 22 వరకు జరిగే సమావేశాల్లో 15 పనిదినాల్లో వివిధ అంశాలపై చర్చిస్తారు. జమ్ము-కశ్మీర్
లో రిజర్వేషన్లకు సంబంధించి పలు సవరణ బిల్లులు ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
పోస్టు ఆఫీసు బిల్లు, ప్రధాని ఎన్నికల అధికారి నియామకం, ఎన్నికల సంఘం విధి
విధానాలకు సంబంధించిన బిల్లులు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు
రానున్నాయి.