ఓ
మెక్సికన్ జాతీయురాలి(31)పై పలుమార్లు
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు,
బాధితురాలు కలిసి గతంలో కొన్ని డీజే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సదరు మెక్సికన్
జాతీయురాలికి ఉపాధి ఇవ్వాలంటే తనను శారీరకంగా సుఖ పెట్టాలని వేధించేవాడని
ఇష్టానుసారం పలుమార్లు అత్యాచారం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
చేశారు.
2019
నుంచి తన పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ అసహజ పద్ధతిలో లైంగికదాడికి పాల్పడి
వేధించాడని బాధితురాలు చెబుతోంది.
పోలీసులకు
బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల మేరకు, 2017 లో ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా స్నేహం కుదిరింది. బంద్రా లోని
ఆమె నివాసంలోనే నిందితుడు తనపై అత్యాచారం చేశాడని, అలాంటి ఘటనలో పలుమార్లు చోటుచేసుకున్నాయని
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
లైంగికంగా వేధించడంతో పాటు తనకు
అప్పగించిన పని సరిగా చేయడం లేదంటూ భౌతికదాడులు చేశాడని చెప్పింది. అలాగే ఆమెకు
సంబంధించిన కొన్ని ఫోటోలను చూపించి బెదిరించాడని పోలీసులకు వివరించింది.
నిందితుడు
2020లో వేరే మహిళను వివాహం చేసుకున్నప్పటికీ తనకు అభ్యంతరకర మేసేజ్ లు, ఫొటోలు
పంపేవాడని లైంగికంగా సహకరించమని కోరేవాడని చెబుతోంది.
బాధితురాలి
ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
పోలీసులు తెలిపారు.