MOUNT ETNA
VOLCANO: ఇటలీలోని
సిసిలీ తూర్పు తీరంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. యూరప్
లోని పర్యాటక ప్రదేశాల్లో ఈ పర్వతప్రాంతం కూడా ఒకటి, వేల సంఖ్యలో సందర్శకులు
ఇక్కడికి వస్తారు. ఈ అగ్నిపర్వతం ఏడాదిలో ఒకసారైనా విస్పోటనం చెందుతుందని, గత పదేళ్ళుగా
ఇలాగే జరుగుతుందని చెబుతున్నారు.
విస్పోటనం కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదంటున్నారు.
మౌంట్
ఎట్నా ఎత్తు 11 వేల అడుగులు. 1,669లో భారీ విస్పోటనం జరిగి 20 వేల మంది మృతి
చెందినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తుంది. శతాబ్దాలుగా ఉబికివచ్చిన లావాతో
అగ్నిపర్వతం చుట్టూ సారవంతనేల ఏర్పడింది. దీంతో ఇక్కడ నిమ్మజాతి రకం ఫలాలతో పాటు
ద్రాక్ష, కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు.