ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని అనుకూలంగా మలుచుకుని మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై ఈడీ ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈడీ దాఖలు చేసింది అనుబంధ ఛార్జిషీటని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త అరోరా నుంచి ఆయన నివాసంలో రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ రెండు దఫాలుగా రూ.2 కోట్లు అందుకున్నారని ఈఢీ ఆరోపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరవాత సంజయ్ సింగ్ కీలక నిందితుడిగా ఉన్నారు. అరోరాను విచారించిన ఈడీ కీలక సమాచారం రాబట్టింది. రెండు దఫాలుగా సంజయ్ సింగ్‌కు రూ.2 కోట్లు ఇచ్చినట్లు ఈడీ అధికారులకు అరోరా విచారణలో వెల్లడించారు.