Shri Ram Pran Pratishta : శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో
నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఆరువేల మంది ప్రముఖులను
ఆహ్వానించారు. పోస్టు ద్వారా ఈ ఆహ్వానాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్,
అతిథులకు పంపింది.
జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా
జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్
మోహన్ భాగవత్ తో పాటు పలువురు వీవీఐపీలు హాజరవుతారు.
పోస్టు ద్వారా ఆహ్వాన పత్రికలు పంపడంతో
పాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ పైల్స్, లింకులు చేరవేస్తున్నారు. అతిథులు తమ ఆధార్
కార్డు విధిగా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సంబంధించిన
తొలి ఆహ్వాన పత్రిక అందడంపై మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు.
మూడు గంటల పాటు ప్రాణ ప్రతిష్ట
కార్యక్రమం జరగనుంది.ఉదయం 11 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి, 2 గంటలకు
ముగిస్తారు. ప్రధాని వచ్చి వెళ్లిన తర్వాతే మిగతా వారిని అనుమతిస్తారు. భద్రతా కారణాల
దృష్ట్యా మొబైల్స్ పై నిషేధం ఉంటుందని ట్రస్టు సభ్యులు తెలిపారు.
రామమందిరంలోని గర్భగుడిలో బంగారు
సింహాసనంపై రామ్ లల్లాను ప్రతిష్టిస్తారు. ప్రధాని వెళ్ళిన తర్వాత మిగతా అతిథులకు
దర్శన భాగ్యం కల్పిస్తారు. మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులను కూడా దర్శనానికి
అనుమతిస్తారు.