సూర్యుడిపై పరిశోధనలకు పంపిన ఆధిత్య ఎల్ 1 ఉపగ్రహం కీలక సమాచారం పంపింది. శాటిలైట్‌లోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్ పని ప్రారంభించింది. పేలోడ్‌లోని రెండు పరికరాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ పేలోడ్స్ సౌర గాలులను అధ్యయనం చేయడం ప్రారంభించాయి.
ఉపగ్రహంలోని సూపర్ థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్టోమీటర్ను సెప్టెంబరు 10న, సోలార్ విండ్ అయాన్ స్పెక్టోమీటర్ను నవంబరు 2న పనిచేయడం ప్రారంభించేలా చేశారు. ఈ రెండు పేలోడ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది.
సౌర గాలుల లక్షణాలపై నెలకొన్న అనుమానాలకు, ఈ పరిశోధనల ద్వారా పరిష్కారం లభించే అవకాశ ముందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర గాలుల్లో ఉండే ప్రక్రియలు, భూమిపై వాటి ప్రభావం వంటి విషయాలపై సమగ్ర అధ్యయనానికి ఈ సమాచారం ఉపయోగపడనుంది. ఈ ఏడాది సెప్టెంబరు2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1 చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఉపగ్రహాన్ని ఎల్ 1 పాయింట్లో ప్రవేశ పెట్టనున్నారు.