అమెరికాలో ఓ యువకుడిని చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్‌రెడ్డి, ఓ యువకుడిని బందించి చిత్రహింసలకు (crime news) గురిచేసిన ఘటన సంచలనంగా మారింది. కొన్ని నెలలుగా అమెరికాలో ఓ 20 ఏళ్ల యువకుడిని బందించి, పీవీసీ పైపుతో కొడుతూ హింసకు గురిచేశాడు. పక్కటెముకలు విరిగేలా కొట్టాడు. అతన్ని బానిసలా మార్చేసి, వెట్టిచాకిరీ చేయించుకున్న ఘటన, స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
బాధితుడి కేకలు విని స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడిని రక్షించి, వెంకటేశ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అతనితోపాటు పెన్మత్స నిఖిల్, శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. అమెరికా రాష్ట్రం మిస్సోరిలోని సెయింట్ ఛార్లెస్ కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
మానవ అక్రమ రవాణా, అపహరణ, ఆయుధాలతో దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
సత్తార్ వెంకటేశ్ రెడ్డికి తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. అమెరికాల్లో వెంకటేశ్ రెడ్డి చేసిన నేరాలను చట్టం చూసుకుంటుందని తమ పార్టీకి సంబంధం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వెంకటేశ్ రెడ్డికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ ప్రకటించింది.