Officials lock temple preventing Annadanam
భారతదేశం ప్రధానంగా హిందూదేశం. ఇతర మతాలను ఆదరించే
సద్గుణం ఉండడమే హిందూమతానికి సమస్య అయిపోయింది. ఆ లక్షణాన్ని ఆసరాగా చేసుకుని
దేశంలోకి చొరబడిన అబ్రహామిక మతాలు ఇస్లాం, క్రైస్తవం…. హిందూమతాన్ని
దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అయినా లౌకికవాదం పేరిట వారిని
భరించాల్సి వస్తోంది. ఇక హిందూ దేవాలయాలపైన సైతం ప్రభుత్వాలు పెత్తనం సాగిస్తుంటే
చూస్తూ కూర్చోవలసి వస్తోంది. అలాంటి ప్రభుత్వాల అండదండలు చూసుకుని అన్యమతాలకు
చెందిన అధికారులు, ఉద్యోగులు చెలరేగిపోతున్నారు. ఆలయాల పవిత్రతను చెడగొట్టే
చర్యలకు పాల్పడుతున్నారు. భక్తులను దేవాలయాలకు రానీయకుండా చేయడానికి రకరకాల వెకిలి
వేషాలు వేస్తున్నారు. అలాంటి దుశ్చర్యల విషయంలో హిందూసమాజం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది.
ఒంగోలు కేశవస్వామిపేటలో 500 సంవత్సరాలుగా చెన్నకేశవస్వామివారి
దేవస్థానం ఉంది. ఆ ఆలయంలో గత 16 సంవత్సరాల నుంచి
గోవింద మాల భక్త బృందం వారిఆధ్వర్యంలో
అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతోంది. అక్కడికి 41 రోజులపాటు వేల
సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతీరోజూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం
మూడు గంటల వరకు భక్తులందరూ అన్నసంతర్పణలో భోజనం చేసుకుని తృప్తిగా వెళ్తుండేవారు. 16
సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలూ లేకుండా నిర్విఘ్నంగా సాగుతోంది.
అటువంటి పవిత్రమైన అన్నదాన కార్యక్రమాన్ని నిలువరించడానికి, తద్వారా భక్తులను
భయభ్రాంతులను చేసి దేవాలయానికి రాకుండా చేయడానికీ కొందరు అధికారులు కుట్ర
పన్నినట్లుగా కనిపిస్తోంది. వారిలో కొందరు అన్యమతస్తులు ఉన్నారన్న అనుమానాలూ
వ్యక్తమవుతున్నాయి.
మొన్న గురువారం అనగా నవంబర్ 30, 2023న ఆర్ అండ్ బి అధికారులు మద్యం మత్తులో గుడి ఉత్తర ద్వారానికి తాళం వేసి
తీసుకుని వెళ్ళిపోయారు. అనుకోని ఆ ఆకస్మిక పరిణామంతో భక్త బృందం కంగుతింది.
భక్తులు ఆ అధికారుల దగ్గరకు వెళ్ళి ఇలా చేసారేమని అడిగారు. దానికి ఆ ఆర్ అండ్ బీ
అధికారులు, ‘‘దేవస్థానం స్థలం మాది, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాము, తాళం
వేసుకుంటాము’’ అంటూ అహంకారంతో సమాధానమిచ్చారు. మద్యం తాగి ఆఫీసులో డ్యూటీ చేస్తున్నది
కాక ప్రశ్నించిన భక్తుల మీద మద్యం మత్తులోఇష్టానుసారంగా
మాట్లాడారు.
ఈ చెన్నకేశవస్వామివారి దేవస్థానం రాష్ట్ర దేవదాయ,
ధర్మదాయ శాఖ వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయానికి ధర్మకర్తలు, ఇతర భక్తులూ
భూములిచ్చారు. ఆ భూములను ప్రభుత్వ భవనాలు, గెస్ట్‌హౌస్‌లకు ఇచ్చారు. ఆ భవనాల్లో బస
చేసే ఉద్యోగులు, అధికారులు తాగి తందనాలాడుతున్నారు. గుడికి తాళాలు వేసి పెత్తనం
చెలాయిస్తున్నారు. తాజా ఘటన తర్వాత స్థానిక భక్తులు కొందరు వెళ్ళి గుడి
ఎగ్జిక్యూటివ్ అధికారితో మాట్లాడారు. అయినా ఫలితం లేకపోయింది. ఈఓ సైతం
చేతులెత్తేసారు.
ఒకపక్క హిందువుల దేవాలయ భూములను ఆక్రమించుకుని వాటిని
ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. మరోపక్క అదే దేవాలయానికి తాళం వేసి భక్తులు
రానీయకుండా, అక్కడ భక్తులకు సేవలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. అన్నదాన
కార్యక్రమం చేయకుండా నిలువరిస్తున్నారు. అసలు మద్యం సేవించి ఆలయంలోకి ఎలా వెడతారు?
అక్కడ తాళం వేసి భక్తులను రానీయకుండా ఎందుకు ఆపుతారు? ఈ చర్యలకు అర్థం ఏమిటి?
హిందువులను తమ దేవాలయాలకు దూరం చేసే ప్రయత్నమే కదా. అలాంటి అరాచకాలకు పాల్పడుతున్న
అధికారులకు ఎవరు అండగా నిలుస్తున్నారు? వారిని ప్రోత్సహిస్తున్నదెవరు? వారిలోనూ,
వారి వెనుకా అన్యమతస్తులున్నారా? ఇలాంటి సందేహాలకు జవాబులు వెతకాలి. ఇలాంటి
సమస్యలకు పరిష్కారం హిందువుల ఐక్య సంఘటనతోనే లభిస్తుంది.