Mitchell Marsh defends: ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్ళు పెట్టి ఫోటోలకు పోజిచ్చిన(resting feet on World Cup trophy) ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా మళ్ళీ అదే పనిచేయడాకికి వెనకాడనంటూ వ్యాఖ్యానించాడు.
ట్రోఫీ విషయంలో అమర్యాదగా వ్యవహరించలేదంటూనే దుందుడుకు వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ
దుమారం రేగింది.
సోషల్
మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఎలాంటి అగౌరవకరమైన భంగిమ లేదని దాని గురించి
ఎక్కువగా ఆలోచించడం లేదన్నారు. నిజాయితీగా చెప్పాలంటే మళ్ళీ ఆ పని చేయడానికి
వెనకాడను అని తేల్చి చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో గెలిచిన తర్వాత కొందరు
ఆస్ట్రేలియా ఆటగాళ్లు వ్యవహరించిన తీరును పలువురు క్రీడాభిమానులు తప్పుబట్టారు. మిచెల్
మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి,
బీరు తాగుతూ దిగిన ఫొటో బయటకు రావడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం
అయ్యాయి. అహంకారంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాచార హక్కు
చట్టం కార్యకర్త పండిట్ కేశవ్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును
స్వీకరించిన పోలీసులు మిచెల్ మార్ష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.