Bharat vs Australia T20 Series: రాయ్పూర్( Raipur) వేదికగా జరిగిన 4వ టీ20 లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఈ
విజయంతో ఐదు మ్యాచుల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 9
వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్
గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 154 పరుగుల మాత్రమే
చేయగల్గింది. దీంతో ఆస్రేలియాపై భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత
బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్
చహర్ 2, రవి
బిష్ణోయ్, అవేశ్
ఖాన్ తలా ఒక వికెట్
తీశారు.
ఆసీస్
కెప్టెన్ మాథ్యూ వేడ్ చివర్లో పోరాడినా ఫలితం లేకపోయింది. వేడ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31, బెన్ మెక్ డెర్మట్ 19, మాథ్యూ షార్ట్ 22, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు.
సిరీస్
ఫలితం తేలడంతో ఇరు జట్ల మధ్య జరిగే ఆఖరి మ్యాచ్ డిసెంబరు 3న బెంగళూరులో జరగనుంది.