తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి
వైకుంఠ ద్వార దర్శనానికి పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని
పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23
నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని
కల్పించనున్నారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో
పాల్గొన్న ధర్మారెడ్డి , వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు కు సంబంధించి కీలక విషయాలు
వెల్లడించారు. భక్తులు చలికి
ఇబ్బంది పడకుండా టైమ్ స్లాట్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94
కౌంటర్ల ద్వారా డిసెంబరు 22
నుంచి 4,23,500 టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం
వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్యదినం రోజు ఉదయం 9 నుంచి 11
గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ
మాడవీధుల్లో విహరించి భక్తులను
కటాక్షిస్తారని తెలిపారు. భక్తులకు
దర్శనమిస్తారు.