ఓ
ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిడ్నాప్(Bihar
Teacher Kidnapped) చేసిన నలుగురు దుండగులు, అతడికి బలవంతంగా పెళ్ళి (forced to marry)చేశారు. ఈ ఘటన బిహార్ లో చోటుచేసుకుంది.
వైశాలి
జిల్లా, పటేపూర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గౌతమ్ కుమార్ అనే వ్యక్తి, ప్రభుత్వ ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నారు. అతడు విధుల్లో ఉండగానే కిడ్నాప్ కు గురయ్యాడు. స్కూలు దగ్గరకు వచ్చిన నలుగురు వ్యక్తులు గౌతమ్
కుమార్ ను ఎత్తుకుపోయారు. అనంతరం, కిడ్నాప్ కు పాల్పడిన వారిలో ఒక వ్యక్తి
కుమార్తెతో ఉపాధ్యాయుడికి బలవంతంగా వివాహం జరిపించారు.
గౌతమ్
కుమార్, ఇటీవలే బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి టీచర్
ఉద్యోగం సాధించారు. అపహరించిన 24 గంటల తర్వాత కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో పెళ్ళి చేశారు.
తాళి కట్టేందుకు నిరాకరించగా దాడి కూడా చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు
మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బలవంతపు
పెళ్ళిళ్ళను పకడ్వా వివాహం అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
గతేడాది బెగుసరాయ్ లో ఓ పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బలవంతంగా
పెళ్ళి జరిపించారు. మరో ఇంజినీర్ విషయంలో
కూడా ఇదే తరహా ఉదంతం చోటుచేసుకుంది. జూనియర్ మేనేజర్ గా పనిచేసే వినోద్ కుమార్ అనే
వ్యక్తి పాట్నాలో ఓ మహిళపై దాడి చేసి
బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు.