కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ (bomb threat) కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం మొదటగా 15 పాఠశాలలకు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. క్రమంగా వాటి సంఖ్య 44కు చేరింది. దీంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు మెయిళ్లు వచ్చిన పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బాంబ్ స్వాడ్‌లతో తనిఖీలు చేశారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు చ్చాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటి సమీపంలోని పాఠశాలకు కూడా బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. ఆయనే స్వయంగా వెళ్లి ఆ మెయిళ్లను పరిశీలించారు. పోలీసుల తనిఖీ తరవాత అవి ఉత్తుత్తి బెదిరింపులని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.