Raipur Stadium
without electricity:
భారత్-
ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నేడు రాయ్ పూర్ వేదికగా ఇరు
జట్లు తలపడనున్నాయి. రాత్రి ఏడుగంటలకు రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్
స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కానీ స్టేడియానికి కరెంటు సరఫరా లేదు.
2009 నుంచి
కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రూ.
3.16 కోట్ల బిల్లు బకాయి చెల్లించకపోవడంతో ఐదేళ్ళ కిందట విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది.
ఛత్తీస్గడ్
క్రికెట్ అసోసియేషన్ వినతి మేరకు ఆ రాష్ట్ర
విద్యుత్ శాఖ ప్రస్తుత మ్యాచ్ కోసం తాత్కాలిక కనెక్షన్ మంజూరు చేసింది. అది కూడా
ప్రేక్షకుల గ్యాలరీ వరకు మాత్రమే, ఫ్లడ్ లైట్ల కోసం జనరేటర్ వినియోగించనున్నారు.
తాత్కాలిక
కనెక్షన్ సామర్థ్యం పెంచాలని క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కోరారని రాయ్పూర్
గ్రామీణ సర్కిల్ ఇన్ ఛార్జి అశోక్ ఖందేల్ వాల్ తెలిపారు. ప్రస్తుతం 220 కేవీ లైన్ ఉండగా దానిని 1 థౌజండ్
కేవీకి పెంచేందుకు అంగీకరించామని పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.
బకాయి
చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు
పంపినప్పటికీ ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు. 2108లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన
తర్వాత నుంచి ఈ స్టేడియంలో మూడు అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. జనరేటర్ సాయంతో
ఫ్లడ్ లైట్లు ఆన్ చేస్తున్నారు.