Boat
Accident@kakinada: కాకినాడ
తీరంలో వేటకు వెళ్లిన బోటులో మంటలు చెలరేగడంతో
రూ. 80 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం నుంచి 12 మంది
జాలర్లు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
కాకినాడ
తీరంలో వేటకు వెళ్లిన బోటు లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదం
సమయంలో బోటులో చిక్కుకున్న 12 మంది
జాలర్లు, కోస్ట్ గార్డు సిబ్బందికి చేరవేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ
ఆపరేషన్ చేపట్టి జాలర్లను కాపాడారు. బోటు
పూర్తిగా కాలిపోవడంతో రూ. 80 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
జాలర్లు
వేటకు వెళ్లే సమయంలో వంట కోసం గ్యాస్ సిలిండర్ ను వెంట తీసుకెళతారు. వేటకు విరామం
ఇచ్చి వంట వండుకునేందుకు సిద్ధం కాగా పెద్ద శబ్దంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.
దీంతో మత్స్యకారులు కోస్ట్ గార్డులను సంప్రదించారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగి
జాలర్లను కాపాడి ఒడ్డుకు తీసుకొస్తున్నారు.