ఈనెలలో బ్యాంకులు 18 రోజులపాటు (banks holidays) మూతపడనున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పండుగలకు బ్యాంకులకు ప్రత్యేకంగా సెలవులు ప్రకటించారు. జాతీయ పండగైన క్రిస్మస్ పర్యదినాల రోజు మాత్రం దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబరు నెలలో బ్యాంకుల సెలవులను ప్రకటించింది.
ప్రతి నెలా రెండు, నాల్గవ శనివారాలు, ఆదివారాలు సహజంగా బ్యాంకులకు సెలవు. ఇక అదనంగా పండగలు రావడంతో డిసెంబరులో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కేటగిరీల కింద రిజర్వు బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకు సెలవుల క్యాలెండర్ను రిజర్వు బ్యాంక్ తయారు చేసి విడుదల చేస్తోంది.