అంతర్జాతీయంగా లభించిన సానుకూల ఫలితాలతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 306 పాయింట్లు పెరిగి, 67295 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు (nifty new record) పెరిగి 20228 పాయింట్ల సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.28గా ఉంది.
సెన్సెక్స్ ఇండెక్స్ 30లో విప్రో, టైటాన్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మారుతీ, అల్ట్రాటెక్, ఎస్బిఐ షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి.