తెలంగాణ
వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు
వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఫలితాలు డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్
118 స్థానాల్లో పోటీ చేయగా, మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది.
బీజేపీ 111 చోట్ల పోటీ చేసి మిత్రపక్షమైన జనసేనకు 8 స్థానాలు కేటాయించింది.
బీఎస్పీ 107 స్థానాల్లో సీపీఎం 19 నియోజకర్గాల్లో పోటీ చేశాయి.
కొన్ని
నియోజకవర్గాల్లో పోలింగ్ రాత్రి పది గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం మూడు
గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సాయంత్రం
మూడు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదు కాగా చివరి రెండు గంటల్లో
పోలింగ్ ఊపందుకుంది.
గ్రామీణ ప్రాంతాలతో
పోల్చుకుంటే పట్టణాల్లో ఓటింగ్ మందకొడిగా సాగింది. మెదక్ లో ఎక్కువ మంది ఓటు హక్కు
వినియోగించుకోగా హైదరాబాద్ లో తక్కువమంది ఓటు వేశారు.
నక్సల్స్
ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 3,341 పోలింగ్
కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను ముగించిన అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు
తరలించారు.
సిర్పూర్,
చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,
ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలను సమస్మాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించి
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది.