ఫైబర్నెట్
కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై
సుప్రీంకోర్టులో విచారణ మళ్ళీ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ను విచారించిన
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం, విచారణను డిసెంబరు12కి
వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని
ఆదేశించింది.
గత నెల 13, 17, 20 నవంబరు 9 తేదీల్లో ఈ పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. స్కిల్ డెవలప్మెంట్
కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసినందున అందులో తీర్పు ఇచ్చిన తర్వాత
దీనిని పరిశీలిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. నేడు విచారణ సందర్భంగా కూడా
ధర్మాసనం అదే విషయాన్ని వెల్లడించింది. 17 ఏ అంశంపై తీర్పు ప్రాసెస్ లో ఉందని
జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.