నాగార్జున సాగర్ డ్యామ్‌ను అర్ధరాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం తదనంతరం
నీళ్ళు విడుదల చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు.
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఆలోచన
చేయడం సరికాదు అన్నారు. ఓట్ల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం ఘోరాతి ఘోరమని
మండిపడ్డారు.
తెలుగు
రాష్ట్రా ల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశ్యంతోనే ఘటన జరిగిందన్నారు.
విజయవాడలో వికసిత్ సంకల్ప్ యాత్ర రథాన్ని ప్రారంభించిన
దగ్గుబాటి పురందరేశ్వరి, కేంద్రం అమలు చేస్తోన్న పథకాలపై అవగాహన కల్పించేందుకే ఈ
కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రభుత్వం నుంచి సాయం ఆశించే వారు ప్రచార రథాల(థియేటర్ వ్యాన్) వద్దకు
వెళ్ళి సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 5లక్షల రూపాయల వరకు వైద్య
ఖర్చులకు కేంద్రం సాయం అందిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న
ఆరోగ్య శ్రీకి బిల్లుల చెల్లింపు
జరగకపోవడంతో ఈ పథకం కింద పేదలకు వైద్యం
అందడం లేదన్నారు.
నాలుగు వందల మండలాల్లో కరవు పరిస్థితులుంటే
వంద మండలాలకే దానిని పరిమితం చేశారని ఏపీ ప్రభుత్వంపై పురందరేశ్వరి ఆగ్రహం వ్యక్తం
చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ఎవరో తెలియక ప్రజలు ఆయన కోసం వెతుకుతున్నారని ఎద్దేవా
చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని
విమర్శించారు.