ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడిని రెండో పెళ్లి చేసుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువతి భారత్ తిరిగి వచ్చింది. ఇద్దరు బిడ్డలకు తల్లైన అంజూ, ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాక్ యువకుడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలను రాజస్తాన్‌లోని మెట్టినింట్లో వదిలేసి పాక్ వెళ్లిన అంజూ, ప్రేమికుడు నసరుల్లాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్‌లోని మారుమూల ప్రాంతంలో వారు గత నాలుగు నెలలుగా సంసారం సాగించారు. తాజాగా అంజూ తన ఇద్దరు బిడ్డలను చూసేందుకు పాక్, భారత సరిహద్దుదాటి వచ్చారు. ఇందుకు ఆమెకు పాక్ నెల రోజుల వీసా మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడేందుకు ఫాతిమా విముఖత చూపారు. బిడ్డలను చూసుకుని మరలా పాక్ వెళ్లనుందని తెలుస్తోంది.
పాక్ ప్రేమికుడు నసరుల్లాతో ఫాతిమాకు విభేదాలొచ్చాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖానికి బుర్ఖా ధరించి భారత్ చేరిన ఫాతిమా, మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు.