US H-1B
renewal pilot programme
గడువు ముగిసిన హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు అమెరికాలో పనిచేస్తోన్న భారత నిపుణులు ఇక స్వదేశానికి
రానవసరం లేదు. డిసెంబరు నుంచి పైలట్ ప్రాజెక్టు కింద అమెరికాలోనే పునరుద్ధరించుకునే
అవకాశం కల్పించారు.
ఈ ప్రోగ్రామ్ కింద తొలుత 20 వేల మందికి వీసాలను రెన్యువల్ చేయనున్నట్లు అమెరికా వీసా సేవల
డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. ప్రయాణ ఖర్చులు, సమయం
దృష్టిలో పెట్టుకుని వీసాదారుల కష్టాలు తొలగించేందుకు ఈ పథకాన్ని
ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
భారత్ లో అమెరికా వీసాలకు డిమాండ్
ఎక్కువగా ఉన్నందున త్వరగా వీసా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు
ప్రయత్నిస్తున్నామన్నారు.
డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్
చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని,
ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలను
వెల్లడిస్తామన్నారు.