మధ్యప్రదేశ్లో అరాచకం వెలుగు చూసింది. గ్వాలియర్ జిల్లా బహదుర్పుర్లో ఓ తండ్రి, కొడుకు దారుణానికి (crime news) ఒడిగట్టారు. ఓ యువకుడిని హతమార్చి 400 ముక్కలుగా నరికారు.అనంతరం ఆ ముక్కలను వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఢిల్లీ కాల్సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్యను మించిపోయేలా ఈ హత్యోదంతం సంచలనంగా మారింది. బహదుర్పుర్ వాసి రాజుఖాన్కు అదే ప్రాంతానికి చెందిన తండ్రీకుమారులు కల్లు ఖాన్, నీజం ఖాన్లకు గొడవ జరిగింది. ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు. రాజుఖాన్ రాజీ చేసుకోవాలని కోరగా వారు రూ.20 వేలు డిమాండ్ చేశారు
డబ్బు ఇవ్వడానికి ఇంటికి వచ్చిన రాజుఖాన్ను హత్య చేసి ముక్కలు చేశారు. 15 సంచుల్లో పెట్టి వివిధ ప్రాంతాల్లో విసిరేశారు.
గ్వాలియర్ జనక్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మురుగుకాలువలో యువకుడి శరీర భాగాలను సెప్టెంబరు 28న గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రీ, కొడుకులను అరెస్ట్ చేశారు.