CYCLONE INFO: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను
ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత
అంచనాలకు భిన్నంగా డిసెంబర్ 2 నుంచి రాష్ట్రంలో వానలు పడతాయని పేర్కొంది.
ఆగ్నేయ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది
నేడు వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ 2నాటికి ఆగ్నేయ
బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ
అధికారులు వివరించారు.
తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో
ఎక్కువగాను ఉత్తర కోస్తాలో తక్కువగా వానలు పడతాయి. డిసెంబరు 2 నుంచి మూడు రోజుల
పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల
తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి.
తుఫానుకు మిచాంగ్ గా నామకరణం చేయనున్నారు.
ఈ పేరును మయన్మార్ సూచించింది. తుఫాను గా మారిన
తర్వాత పేరును అధికారికంగా వెల్లడిస్తారు.