అమెరికాకు చెందిన సైనిక విమానం (crime news) జపాన్ సముద్రంలో కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యకుషిమా దీవి సమీపంలో అమెరికా సైనిక విమానం కూలిపోయింది. కూలిపోయిన విమానంలో 8 మంది సైనికులు ఉన్నారని అమెరికా ప్రకటించింది. ముందుగా మంటల్లో చిక్కుకున్న విమానం సముద్రంలో కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.
సైనికుల ఆచూకీ కనుగొనేందుకు జపాన్ తీర రక్షకదళం రంగంలోకి దిగింది. ప్రమాద ప్రాంతంలో ఒకరిని రక్షించారు. ఆ తరవాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది హెలికాఫ్టర్ తరహా విమానం అని రెండు విధాలా పనిచేస్తుందని తెలుస్తోంది. అమెరికా నేవీకి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కి.మీ దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తరహా విమానాలు ఇటీవల తరచూ కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.