దేశంలో
నిర్మిస్తున్న మొదటి బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించి అభివృద్ధి పనుల పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని
వైష్ణవ్ వివరించారు. గుజరాత్ రాష్ట్రంలో బిలిమోరా- సూరత్ మధ్య నిర్మిస్తున్న 50
కిలోమీటర్ల మార్గం, 2026 ఆగస్టు 26 నాటికి పూర్తి అవుతుందన్నారు.
దేశీయ రైల్వే
శాఖను అభివృద్ధి చేసేందుకు పలురకాల ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నఅశ్విని
వైష్ణవ్, ప్రమాదాల నివారణకు దేశీయ
పరిజ్ఞానంతో తయారు చేసిన కవచ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.
ట్రాకులపై
ఏనుగుల రక్షణ కోసం గజరాజ్ విధానాన్ని కూడా అమలు చేయబోతున్నామన్నారు. దేశంలోని
అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో మరిన్ని ట్రాకులు వేస్తున్నట్లు
తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసుల సంఖ్యను పెంచామన్నారు.
ముంబై-అహ్మదాబాద్
బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులకు రూ. 1.08 లక్షల కోట్లు అవుతాయని అంచనా
వేశారు. ఇందులో రూ.10 వేల కోట్లు కేంద్రం అందజేస్తుండగా, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చెరో రూ. 5 కోట్లు
సమకూరుస్తున్నాయి. మిగతా మొత్తాన్ని జపాన్ అప్పుగా ఇస్తోంది. 0.1 శాతం వడ్డీతో
రుణంగా ఇస్తోంది.