Dravid to
continue as head coach:
భారత
క్రికెట్ జట్టు ప్రదాన కోచ్ గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ అంగీకరించడంతో ఆయన
పదవీకాలాన్నిబీసీసీఐ(BCCI) పొడిగించింది. రాహుల్ ద్రావిడ్ తో
పాటు ఇతర సహాయ సిబ్బంది పదవీకాలాన్ని కూడా పొడిగించినట్లు పేర్కొంది.
వన్డే
వరల్డ్ కప్‌తో ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. మళ్లీ కోచ్ గా కొనసాగేందుకు ఆయన
సముఖంగా లేడని వార్తలొచ్చాయి. అయితే బీసీసీఐ కు చెందిన పలువురు ముఖ్యలు రాహుల్ తో
మాట్లాడగా కోచ్ గా కొనసాగేందుకు సుముఖుత తెలిపారు.
రాహుల్
ద్రావిడ్ విజన్, ప్రొఫెషనలిజమ్ భారత్ విజయాలకు మూలస్తంభాలని బీసీసీఐ అధ్యక్షుడు
రోజర్ బిన్నీ అన్నారు. ద్రావిడ్ కోచ్ గా భారత్ జట్టు విజయ ప్రస్థానం
కొనసాగుతుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు.
ప్రతిభ,
నిబద్ధతల విషయంలో కోచ్ గా ద్రావిడ్ తనను తాను నిరూపించుకున్నాడని బీసీసీఐ కార్యదర్శి
జై షా అన్నారు. మూడు ఫార్మట్ల ర్యాంకింగ్స్ లో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉండటానికి
రాహుల్ ద్రావిడ్ విజనే కారణమన్నారు.
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్
పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పదవికాలాన్ని బీసీసీఐ పొడిగించింది. వచ్చే
ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుండగా, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జరగనుంది.