విమానాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో వింత ఘటనతో అంతర్జాతీయ విమానాన్ని (international flight) అత్యవసరంగా దించాల్సి వచ్చింది. మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ బయలు దేరిన విమానంలో ఇద్దరు దంపతులు గొడవ పడి కొట్టుకున్నారు. దీంతో విమాన సిబ్బంది అప్రమత్తమై ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
జర్మనీకి చెందిన వ్యక్తి, థాయ్‌కు చెందిన అతని భార్యతో విమానంలో గొడవ పడ్డారు. గొడవ ముదరి కొట్టుకున్నారు. దీంతో తోటి సిబ్బంది, ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లుఫ్తాన్సా విమానాన్ని పాకిస్తాన్‌లో దించడానికి ప్రయత్నించినా అక్కడి విమానాశ్రయ అధికారులు అంగీకరించలేదు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర
ల్యాండింగ్ చేసి భార్యతో గొడవపడ్డ జర్మన్ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. జర్మన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.