వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టు (ap high court) నోటీసులు జారీ చేసింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిబంధనలకు విరుద్దమని హైకోర్టులో పిల్ దాఖలైంది.ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది. సలహాదారు సజ్జలకు వ్యక్తిగత హోదాలో నోటీసులు పంపారు. ఈ కేసుపై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వారి వాదనలు వినిపించారు. పిల్‌కు విచారణ అర్హత ఉందని కోర్టు భావించి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఖర్చతో రాజకీయ ప్రయోజనాల కోసం కార్యక్రమం చేస్తున్నారని న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీస్ రూల్స్‌కు విరుద్దమని వారు వాదించారు. వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలతోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రూరల్ డెవలప్మెంట్, పురపాలక శాఖ, గ్రామ, వార్డ్ సచివాలయం ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.