కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (ysrcp mla) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు మరో 140 రోజుల్లో ఉన్నాయని, ఆ తరవాత సీఎం ఎవరో తేలిపోతుందన్నారు. తప్పకుండా ఓ క్రైస్తవుడు, అదే జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు ద్వారంపూడి చెప్పారు. కాకినాడ మెక్లారిన్ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ద్వారంపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చో పాస్టర్లందరికీ తెలుసని ఆయన అన్నారు. స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోవాలంటే జగన్ మరోసారి సీఎం కావాలని ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే క్రైస్తవుల ఆశీర్వాదాల వల్లేనని ఆయన అన్నారు.