Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని
వాతావరణ శాఖ(imd) అంచనా వేస్తోంది. దక్షిణ అండమాన్
పరిధిలో ఏర్పడిన అల్పపీడనం, ముందస్తు అంచనాలకు భిన్నంగా గురువారం నాటికి వాయుగుండంగా,
డిసెంబర్ 2న తుఫానుగా మారనుంది.
తుఫాను
కోస్తాంధ్ర ప్రాంతానికి సమీపంలో రాకపోయినా దాని ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని
ఐఎండీ నివేదించింది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో
పలు చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని
వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఒక
వేళ తుఫాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వానలకు ఈదురు గాలులు తొడైతే పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కోతకు వచ్చిన వరి
పంట విషయంలో జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.