టీడీపీ కార్యకర్త హత్య కేసులో నందిగామ కోర్టు కీలక తీర్పు(crime news) వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో 2006లో వినాయక నిమజ్జనం సందర్శంగా జరిగిన గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త నలజాల నరసింహయ్యను హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులుగా కేసు నమోదు చేశారు.
గతంలో ఈ కేసు విచారణ మచిలీపట్నం కోర్టులో నడిచింది. తరవాత నందిగామ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయడంతో వాదనలు ప్రారంభించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిన్న తుది తీర్పు వెలువరించారు. ప్రస్తుత వైసీపీకి చెందిన పగడాల సుబ్బారావు, నెల్లూరి నరసింహారావు, యండ్రాతి శ్రీనివాసరావు, గుత్తా నారాయణరావు, యండ్రాతి పూర్ణచంద్రరావు, గూడపాటి పుల్లయ్య, రమణ, హనుమయ్య, వసంతరెడ్డిలకు యావజ్జీవ శిక్ష విధించారు. అనంతరం వారిని
రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.