Australia win by 5 wickets : భారత్,
ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 క్రికెట్ సిరీస్(five match series)లో భాగంగా జరిగిన కీలకపోరులో కంగూరు జట్టు
విజయం సాధించింది. దీంతో సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మ్యాక్స్ వెల్
సెంచరీతో అదరగొట్టడంతో భారతపై ఆస్ట్రేలియా
జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
భారత్
నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. మ్యాక్స్ వెల్
48 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఆసీస్
ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 35, ఆరోన్ హార్డీ 16, జోష్ ఇంగ్లిస్ 10, స్టోయినిస్
17 పరుగులు చేశారు.టిమ్ డేవిడ్ డకౌట్ కాగా, మాథ్యూ వేడ్ 28 పరుగులు చేయడంతో
కంగారూ జట్టు విజయం సాధించింది.
తొలుత
బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 222 పరుగులు
చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
జైస్వాల్ ఆరు పరుగులకే ఔట్ కాగా, ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య
కుమార్ యాదవ్ 29 బంతుల్లో 39 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 24 బంతులు ఆడి 31
పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
నాలుగో టీ20 పోరు డిసెంబరు 1న రాయ్పూర్ లో
జరగనుండగా, ఆఖరి మ్యాచ్ డిసెంబరు 3న హైదరాబాద్ లో ఉంటుంది.