రైతుల
సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన వ్యక్తం చేస్తోన్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు
చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులను ఆదుకోవాలని, కరువు
మండలాల ప్రకటనలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.
వైసీపీ
ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన చేస్తోందని విమర్శించిన కిసాన్ మోర్చా రాష్ట్ర
అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి,
రాష్ట్ర
వ్యవసాయ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు.
కిసాన్
మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు గుంటూరులోని
వ్యవసాయ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు, కిసాన్ మోర్చా నేతల మధ్య
తోపులాట జరిగింది.
కుమార
స్వామిని ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన
వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ
నిరసన కార్యక్రమానికి పలు రైతు సంఘాలు మద్దుతు తెలిపాయి. సమస్యలు పరిష్కరించాలని
కోరితే పోలీసులతో బెదిరించడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికాయి.
నెల్లూరు
జిల్లా కావలిలో కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గంటూరు
చుట్టుగుంట రైతు బజారు వద్ద బీజేపీ మహిళా నేతలను పోలీసులు అరెస్టు
చేసి స్టేషన్ కు తరలించారు.