కన్నబిడ్డను కీచకులకు అప్పగించిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్త మానసికంగా అనారోగ్యానికి గురి కావడంతో, ఓ మహిళ అతడిని వదిలేసి, శిశుపాలన్‌తో సహజీవనం చేసింది. ఏడేళ్ల చిన్న కుమార్తె ఆమె వద్ద ఉండేది. శిశుపాలన్ చిన్నారిపై లైంగిక దాడి చేయడంతో ఆమె గాయపడింది. ఆ బాధను తల్లికి చెప్పింది. అయినా బిడ్డ మాటలు పట్టించుకోలేదు. అలా శిశుపాలన్ లైంగిక దాడికి (crime news) ఆమె సహకరించింది.
తన వద్దకు వచ్చిన 11 ఏళ్ల అక్కకు ఆ చిన్నారి బాధను చెప్పుకుంది. వారిద్దరూ తల్లి వద్ద నుంచి తప్పించుకుని బామ్మ వద్దకు చేరారు. ఆమె సహకారంతో వారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. 2018లో వారికి జరిగిన అన్యాయాన్ని అక్కడి అధికారులకు వెల్లడించారు. దీంతో కేసు నమోదైంది. కేసు విచారణలో ఉండగానే కీచకుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును విచారించిన కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు బాధిత తల్లికి 40 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. ఈ కేసులో 22 మంది సాక్షులను విచారించారు.