ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య (nijjar murder probe) తరవాత భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. నిజ్జర్ హత్యలో తమ ప్రమేయం ఉందనేందుకు సాక్ష్యాలు చూపాలని భారత్ స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తు జరుపుతోంది. అయితే ఇంత వరకు సాధించిన పురోగతి విషయాలను మాత్రం భారత్‌తో పంచుకోలేదు. ఇక అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హత్య కుట్రను భగ్నం చేసినట్లు స్థానిక పోలీసులు భారత్‌కు తెలిపారు.
అమెరికా అధికారులు పన్నూన్ హత్య కుట్ర భగ్నంపై పలు అంశాలను భారత్‌తో పంచుకున్నారని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. అయితే నిజ్జర్ హత్య దర్యాప్తులో మాత్రం కెనడా ఎలాంటి ఆధారాలు చూపలేదని, రెండు దేశాల మధ్య దర్యాప్తులో తేడా ఉందని ఆయన అన్నారు.
పన్నున్ హత్య కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. దీనిపై అమెరికా కూడా భారత్‌కు సమాచారం ఇచ్చింది.
పన్నూన్ హత్య కుట్రపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వెల్లడించారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా చేసింది, కేవలం ఆరోపణలు మాత్రమేనని అవి వాస్తవాలు కాదని సంజయ్ కుమార్ వర్మ అభిప్రాయపడ్డారు.