ఓ ఇంజినిీరింగ్
విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండల
పరిధిలో చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న
విద్యార్థిని కోలగట్ల రేచల్ రెడ్డి(19) బలవన్మరణం చెందింది. ఆత్మహత్య కోసం కొన్ని
రోజుల కిందటే ఆన్లైన్ లో విషాన్నిఆర్డర్ చేసినట్లుగా తేలింది.
ప్రకాశం
జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన రేచల్ రెడ్డి,
బాలికల వసతి గృహం లో ఉంటూ బీటెక్ చదువుతుంది. ఆదివారం రాత్రి అందరితో కలిసి నిద్రించింది.
తెల్లవారు జామున పక్కగదిలో ఉన్న తమ ఊరికి చెందిన స్నేహితురాలి వద్దకు వెళ్లి విషం
తాగినట్లు చెప్పి పడిపోయింది.
హాస్టల్
సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది
తెలిపారు.
ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి
తల్లిదండ్రులు, బిడ్డ మృతికి కారణాల కోసం కాలేజీ యాజమాన్యంతో పాటు సహ విద్యార్థులను
విచారించారు. ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్ళారు.
రేచల్
రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి స్పస్టమైన కారణం తెలియదని కాలేజీ సిబ్బంది
చెబుతుండగా, ఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు
చెబుతున్నారు.