Rain alert :
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని
మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది.
రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం
తెలిపింది. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందని
వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
లో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు
రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే
అవకాశం ఉంది.
నెల్లూరు,
అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు తేలికపాటి
నుంచి మోస్తరు వానలు కురిచే అవకాశముంది.
తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో నాలుగు రోజులు వానలు
కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,
రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.